Love Story Movie: మొదటి రోజే రికార్డులు సృష్టించిన లవ్ స్టోరీ సినిమా

Love Story Movie: *బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే కాసుల వర్షం *భారీ ఓపెనింగ్ కలెక్షన్లు తెచ్చుకున్న సినిమాగా రికార్డు

admin1
Updated on: 26 Sept 2021 12:00 PM IST
Love Story Movie has Grossed Over Rs 10 Crore Worldwide Record Rating | Cinema News Today
X

లవ్ స్టోరీ సినిమా (ఫోటో- ది హన్స్ ఇండియా)

Love Story Movie - Collections: యువ హీరో నాగచైతన్య మరియు "ఫిదా" బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "లవ్ స్టోరీ". శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 10 కోట్ల రెవెన్యూ నమోదు చేసుకుంది. అంతే కాకుండా ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే భారీ ఓపెనింగ్ కలెక్షన్లు తెచ్చుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

కానీ మొట్ట మొదటి రోజే భారీ కలెక్షన్ల ఢంకా మోగించిన "లవ్ స్టోరీ" సినిమా యూ ఎస్ లో మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయితే ఈ సినిమా మొదటి రోజున భారీ కలెక్షన్లు నమోదు చేసుకోవడానికి గల కారణాల్లో మెగాస్టార్ చిరంజీవి, ఆమిర్ ఖాన్ వంటి వారు ఈ సినిమాని ప్రమోట్ చేయడం. సారంగదరియా, నీ చిత్రం చూసి పాటలు యూట్యూబ్ లో చార్ట్ బస్టర్ గా నిలవడం, ఇక నాగచైతన్య మరియు సాయి పల్లవి ల మధ్య కెమిస్ట్రీ చూడాలని ఆసక్తి కూడా ప్రేక్షకులను థియేటర్ల దాకా తీసుకు వచ్చిందని చెప్పుకోవచ్చు.

admin1

admin1

Next Story