Puri Jagannadh: పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో?

Puri Jagannadh: పూరి ముందు ఉన్న బోలెడు ఆప్షన్లు

Jyothi
Updated on: 13 Sept 2022 2:30 PM IST
Lots of Options in Front of Puri Jagannadh
X

Puri Jagannadh: పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో?

Puri Jagannadh: "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యనే విడుదలైన "లైగర్" సినిమాతో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో పూరి జగన్నాథ్ తన కెరియర్ లో పది అడుగులు వెనక్కి వేసినట్లు అయిపోయింది. ఇక మళ్ళీ తాను ఫామ్ లో ఉన్నట్లుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తన తదుపరి స్క్రిప్ట్ ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికోసం పూరీ జగన్నాథ్ కు ఒక మంచి హీరో కావాల్సి ఉంది. ముందు సల్మాన్ ఖాన్ అయితే తన సినిమాకి సెట్ అవుతారని అనుకున్నాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద హీరో డేట్లు దొరకటం కష్టమైన విషయం. అయితే బాలీవుడ్ హీరోల మీద కన్నేసిన పూరి జగన్నాథ్ హిందీలో పలు హీరోలకు కథ వినిపించి ఎవరికి నచ్చితే వారితో సినిమా తీయాలని అనుకుంటున్నారు.

పెద్ద హీరో దొరికినా సరే రెమ్యూనరేషన్లు ఎక్కువ లేకుండా వందకోట్ల బడ్జెట్ తో సినిమా సేఫ్ గా తీయాలని పూరి ప్లాన్ వేస్తున్నారు. కానీ వంద కోట్ల బడ్జెట్ అంటే పెద్ద హీరోల డేట్ లు దొరకకపోవచ్చు. మరోవైపు బాలకృష్ణకి పూరీ జగన్నాథ్ కి మంచి ర్యాపో ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన "పైసా వసూల్" అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ బాలయ్య ఇప్పటికీ పూరికి కాల్ షీట్లు ఇవ్వడానికి రెడీ గానే ఉన్నారు. మరి పూరి జగన్నాథ్ బాలకృష్ణతో సినిమా తీస్తారా లేక తనయుడు ఆకాష్ పూరి కరియర్ ని సెట్ చేసే ప్లాన్ చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story