Anthuleni Katha: పాత ఫార్ములాతో కొత్త కథ ప్లాన్ చేసిన లోకేష్ కనగరాజ్

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నాడు.

Arun Chilukuri
Published on: 15 Sept 2023 4:57 PM IST
Lokesh Kanagaraj Starts Work On Thalaivar 171
X

Anthuleni Katha: పాత ఫార్ములాతో కొత్త కథ ప్లాన్ చేసిన లోకేష్ కనగరాజ్

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఐతే లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో చేసే మూవీ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని తెలుస్తోంది. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఏమాత్రం సంబంధంలేదంటున్నారు. కాని అంతులేని కథతో ఈ సినిమాకు లింకుందనే ప్రచారాలు పెరిగాయి.

జైలర్ గా ఒకేసారి 6 సెంచరీలు కొట్టిన రజినీకాంత్, ఈసారి వెయ్యి కోట్ల మీద కన్నేశాడు. లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో తన కొత్త మూవీలో పాత ఫార్ములా వాడబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ ప్రజెంట్ లియో రిలీజ్ పనుల్లో ఉన్నాడు. అయితే రజినీకాంత్ తో తనుప్లాన్ చేసిన కొత్త మూవీ తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. జూన్ నుంచి షూటింగ్ అంటున్నారు కాని లెక్కలు సడన్ గా మారినట్టున్నాయి.

కమల్ హాసన్ తో లోకేష్ సినిమా తీసినప్పుడు తన పాత మూవీ విక్రమ్ లోని పాత్రని తీసుకుని కథ అల్లాడు. ఇప్పుడు అలానే రజినీకాంత్ కోసం కూడా సూపర్ స్టార్ పాత హిట్ మూవీనే రెఫరెన్స్ గా తీసుకుంటున్నాడట.

నిజానికి రజినీకాంత్ తో లోకేష్ తీసే మూవీ మాత్రం తన సినిమాటిక్ యూనివర్స్ తో లింక్ చేయట్లేదట ఈ దర్శకుడు. ఈనగరం, మాస్టార్ లా ఇది స్పెషల్ మూవీ అంటున్నారు. కాని పరోక్షంగా మాత్రం లింకు ఉండేలా ఉంది. కమల్, రజినీకాంత్ కలిసి చేసిన అంతులేని కథ స్టోరీ లైన్ తోపాటు పాత్రని లోకేష్ కనకరాజ్ రెఫరెన్స్ గా తీసుకున్నాడంటున్నారు.

పాత పాత్రలతో కొత్త కథని సరికొత్త మూవీని తీయటంలో లోకేష్ ఎక్స్ పర్ట్ గా మారాడు. విక్రమ్ తో అదే పని చేసి హిట్ మెట్టెక్కాడు. ఇప్పుడు జైలర్ సక్సెస్ తో స్వింగ్ లో ఉన్న రజినీకాంత్ కోసం ఘనమైన గతాన్నే తవ్వుతున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story