టాలీవుడ్ హీరో తో చేతులు కలపనున్న లోకేష్ కనగరాజ్

Lokesh Kanagaraj Joins Hands With Tollywood Hero
x

టాలీవుడ్ హీరో తో చేతులు కలపనున్న లోకేష్ కనగరాజ్

Highlights

Lokesh Kanagaraj: కమల్ హాసన్ డైరెక్టర్ తో అల్లు అర్జున్

Lokesh Kanagaraj: ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా పుష్ప: ది రైజ్. ఎర్రచందనం బాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి రెండవ భాగం గా తెరకెక్కనున్న "పుష్ప: ది రూల్" కూడా బాక్సాఫీస్ వద్ద అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ మధ్యనే ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల కలెక్షన్లను అందుకున్న విక్రమ్ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా ని చేయబోతున్నారు.

గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. హిందీలో ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ మరియు కన్నడలో హొంబలే ఫిలింస్ వారు సమర్పిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories