Lokesh Kanagaraj: సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్

Lokesh Kanagaraj Clarifies on the Next Movie | Tollywood News
x

Lokesh Kanagaraj: సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్

Highlights

Lokesh Kanagaraj: సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన డైరెక్టర్

Lokesh Kanagaraj: కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ "ఖైదీ" సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించారు లోకేష్. అయితే తాజాగా కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు లోకేష్ కనగరాజ్. అయితే "ఖైదీ" మరియు విక్రమ్ సినిమా లను కలుపుతూ ఒక సినిమాటిక్ యూనివర్స్ కూడా క్రియేట్ చేశారు ఈ డైరెక్టర్.

ఈ నేపథ్యంలో ఒక అభిమాని ఖైదీ సినిమా లో చనిపోయిన అర్జున్ దాస్ పాత్ర మళ్లీ విక్రమ్ సినిమాలో ఎలా బతికి వచ్చిందంటూ ప్రశ్నించగా లోకేష్ ఆ ప్రశ్నకు రియాక్ట్ అయి సమాధానమిచ్చారు.అంబు పాత్ర చనిపోలేదని తనకి కేవలం గాయం అవుతుందని ఈ విషయం గురించి మరింత క్లారిటీగా ఖైదీ 2 సినిమా లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఖైదీ 2 సినిమా లో కూడా విక్రమ్ కథకి సంబంధం ఉంటుందని ముఖ్యంగా విక్రమ్ సినిమా లో పరిచయమైన రోలెక్స్ విలన్ పాత్ర ఖైదీ 2 లో కచ్చితంగా ఉండబోతోందని సమాచారం. అయితే ప్రస్తుతానికి లోకేష్ కనగరాజ్ విజయ్ హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా ఈ ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories