లైవ్‌లో దెయ్యాన్నిచూశారా? కాజల్ చూపిస్తోంది.. లైవ్ టెలికాస్ట్ ట్రైలర్ రిలీజ్

లైవ్‌లో దెయ్యాన్నిచూశారా? కాజల్ చూపిస్తోంది..  లైవ్ టెలికాస్ట్ ట్రైలర్ రిలీజ్
x
Highlights

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేసే పనిలో ఉంది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే కాజల్ నటిచించి వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్' విడుదలకు సిద్ధమైంది. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతుంది. ఫిబ్రవరి 12వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.

ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వినూత్న ఆలోచన చేసి ఓ ఇంటికి వెళ్లిన కాజల్ బృందం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనే విషయాలను తెలియపర్చుతూ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ మూవీలో కాజల్ టీవీ రిపోర్టర్‌గా కనిపించనుంది. సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామని కాజల్ చేసిన ప్రయత్నమే ఈ 'లైవ్ టెలికాస్ట్'. ఇక కేవలం ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్.. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో వైభవ్‌, ఆనంది కీలక పాత్రలు పోషించారు. కాజల్ అగర్వాల్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన సంగతి తెలిసిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories