Tollywood Movies: ఈ వారం విడుదలకు సిద్ధమైన సినిమాల జాబితా

Tollywood Movies: థియేటర్ లు రీ ఓపెన్ అవ్వడంతో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

admin1
Updated on: 16 Aug 2021 6:07 PM IST
List of Tollywood Movies Ready for Release This Week
X

Tollywood Movies: ఈ వారం విడుదలకు సిద్ధమైన సినిమాల జాబితా

Tollywood Movies: థియేటర్ లు రీ ఓపెన్ అవ్వడంతో చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య కూడా తగ్గడం లేదు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా కూడా అటు థియేటర్‌లలోనూ, ఇటు ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేశాయి. అలాగే ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు విడుదల సిద్ధమవుతున్నాయి. ఈవారం ఓటీటీల్లో రాబోతున్న సినిమాలేంటో ఒక లుక్కెయండి. 'హీరో, కమెడియన్ సునీల్‌ కీలక పాత్రలో తెరకెక్కిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'కనబడుటలేదు' ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్‌ ఒక డిటెక్టివ్‌గా కనిపించనునుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

అలాగే శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనున్న 'రాజ రాజ చోర' సినిమా కు హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. 'క్రేజీ అంకుల్స్‌' గా రాజా రవీంద్ర, మనో, భరణి కనిపించునున్న సినిమా కూడా ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన "ఎఫ్ 9" కూడా ఆగస్టు 19న ఇంగ్లీష్‌, హిందీతో మరియు మిగతా భారతీయ భాషల్లో విడుదల కానుంది. నటుడు సంపూర్ణేశ్‌ బాబు కూడా 'బజార్‌ రౌడీ' అనే సినిమాతో ఆగస్టు 20న విడుదలయి ప్రేక్షకులను అలరించునున్నారు.

ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ చిత్రాల లిస్ట్ కూడా చూసేయండి.

ఆహా వీడియో :

తరగతి గది దాటి : ఆగస్టు 20

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

ఇవాన్‌ అల్మైటీ : ఆగస్టు 16

ద స్కెలిటన్‌ ట్విన్స్‌ : ఆగస్టు 17

నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ : ఆగస్టు 18

అన్నెట్టే : ఆగస్టు 20

కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ : ఆగస్టు 20

హోమ్‌ : ఆగస్టు 19

నెట్‌ఫ్లిక్స్‌:

కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో : ఆగస్టు 20

స్వీట్‌గర్ల్‌ : ఆగస్టు 21

జీ 5:

200 హల్లా హో : ఆగస్టు 20

ఆల్ట్‌ బాలాజీ:

కార్టెల్‌ : ఆగస్టు 20

admin1

admin1

Next Story