Linguswamy: తెలుగు నిర్మాతలకి వార్నింగ్ ఇస్తున్న లింగుస్వామి

Linguswamy Giving Warning to Telugu Producers
x

Linguswamy: తెలుగు నిర్మాతలకి వార్నింగ్ ఇస్తున్న లింగుస్వామి

Highlights

Linguswamy: వారీసు సినిమా విడుదల విషయంలో షాకింగ్ కామెంట్లు చేస్తున్న లింగుస్వామి

Linguswamy: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న "వారీసు" సినిమా త్వరలో తెలుగు మరియు తమిళ్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా వివాదాలలో ఇరుక్కుంటుంది. ఒకవైపు బాలయ్య "వీరసింహారెడ్డి" మరియు చిరంజీవి "వాల్తేరు వీరయ్య" సినిమాలు కూడా అదే సమయంలో విడుదల కాబోతుండగా నిర్మాత దిల్ రాజు మాత్రం తన సినిమా కోసం ఎక్కువ గానే థియేటర్లను బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు తెలుగు నిర్మాతలు 2019లో దిల్ రాజు చేసిన కొన్ని వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. పండగల సమయంలో తెలుగు సినిమాలకీ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ బాహుబలి సినిమా తర్వాత సినిమాల మధ్య ఎటువంటి ఎల్లలు లేవని, భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా ఒకటే అని ఇండస్ట్రీలు ఒకటయ్యాయని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

కానీ తాజాగా ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. వారీసు పై ఆంక్షలు పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు తమిళ్ థియేటర్లలో చాలా సులువుగా యాక్సస్ పొందుతున్నాయని, ఈ సమయంలో వారీసు ని పరిమితం చేసే ప్రయత్నాలు చేస్తే తెలుగు సినిమాలపై చెడు ప్రభావం ఉంటుందని అన్నారు. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరించక మానరు. రజినీకాంత్, శంకర్, కమల్ హాసన్ ల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. ఇలాంటి సమయంలో లింగు స్వామి ఇలా లూస్ టాక్ చేయటం అంత మంచిది కాదని తమిళ నిర్మాతలు ముందుకు వచ్చి ఈ విషయాన్ని సామరస్యంగా సెటిల్ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories