Liger: 'లైగర్' టీజర్ విడుదల వాయిదా...కారణం ఏంటో తెలుసా!

Liger: కోవిడ్ కారణంగా లైగర్ టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Kranthi
Published on: 9 May 2021 12:30 PM IST
Liger Movie Teaser Release Postponed Due to Corona
X

విజయ్ దేవరకొండ లైగర్ (ఫైల్ ఇమేజ్)

Liger: ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెలిసిందే. అది అలా ఉంటే ఈరోజు విజయ్ తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న లైగర్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఎందరో సమయానికి ఆక్సిజన్ అందక ప్రాణాలను విడుస్తున్నారు. దీన్ని దృంష్టిలో పెట్టుకుని లైగర్ నుంచి ఎటువంటీ అప్ డేట్ ఇవ్వడం లేదని.. టీజర్‌ విడుదలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ నోట్‌ను విడుదల చేసింది లైగర్ టీమ్.

లైగర్ మూవీని తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని ప్రధాన భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. విజయ్‌కు జోడిగా హిందీ భామ, స్టార్ కిడ్ అనన్య నటిస్తోంది. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఈ సారి పాన్ ఇండియా లెవల్లో వస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు కలిసి నిర్మిస్తున్నారు


Kranthi

Kranthi

Next Story