Liger Movie Update: విడుదల తేదీ ప్రకటించిన లైగర్ బృందం

Liger Movie Team Announced Movie and Glimpse Release Dates
x

విడుదల తేదీ ప్రకటించిన లైగర్ బృందం

Highlights

* లైగర్ విడుదల అప్పుడే అంటున్న టీమ్

Liger Movie Update: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమవుతున్నాడు. తాజాగా తన ఆశలన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న "లైగర్" పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్. బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించడం తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారికంగా ప్రకటించింది ఈ చిత్ర బృందం. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతున్న ట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే డిసెంబర్ 31న న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు పూరి అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories