Liger Movie: ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఇన్ని నెలలా?

*ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఇన్ని నెలలా?

Rama Rao
Published on: 15 Jun 2022 4:40 PM IST
Liger Movie Shooting for 9 Months | Tollywood News
X

ఒక్క సినిమా పూర్తి చేయడానికి ఇన్ని నెలలా? 

Liger Movie: ఎప్పుడో కరోనా కి ముందు 2019లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కానీ ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మరే సినిమాని విడుదల చేయలేదు. ఇప్పుడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "లైగర్" సినిమాతో బిజీగా ఉన్నారు పూరి. షూటింగ్ నవంబర్ లోనే పూర్తయింది కానీ సినిమా మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఏ సినిమా షూటింగ్ అయినా సరే కేవలం 90 రోజుల్లో పూర్తి చేసే పూరి జగన్నాథ్ రెండు నెలలుగా సినిమా నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి తొమ్మిది నెలలు గడిచింది దీంతో అసలు పూరి జగన్నాథ్ ఏం చేస్తున్నారు అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే ల విషయంలో కరణ్ జోహార్ భారీగానే ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ పేరుని కూడా 'ది విజయ్ దేవరకొండ' గా మార్చి అందరి దృష్టిని ఆకర్షించారు. దీని వల్లే ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story