LIGER: విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `లైగ‌ర్` రిలీజ్ డేట్

Samba Siva Rao
Published on: 10 Feb 2021 7:39 PM IST
#LIGER
X

LIGER

విజయ్‌ దేవరకొండ హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `లైగ‌ర్'. ఈ సినిమాకు సంబంధిన తాజా అప్ డేట్ బుధవారం వచ్చింది. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ లెగర్ సినిమా ట్యాగ్‌ లైన్ 'సాలా క్రాస్‌ బ్రీడ్‌'‌. టైటిల్‌ లో లైగర్‌ అంటే సింహం, పులికి పుట్టే బిడ్డ అని అర్థం. వెరైటీ టైటిల్ కోసం ఇందుకు తగ్గట్లుగానే ఫస్ట్‌లుక్‌ను డిజైన్ చేసి విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. గురువారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఉంటుంది.

విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్‌, ఛార్మి, అపూర్వ మెహతా, హీరూ యష్‌ జోహార్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని గురువారం ఉదయం ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా విడుదల సెప్టెంబర్ లో ఉండొచ్చని సమాచారం.

ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు విడుదల తేదీని ప్రకటించాయి. విజయ్ సినిమా విడుదల తేదీని ప్రకటించడంలో కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనను రిలీజ్ డేట్ చెప్పాలని కోరుతున్నారు. దీంతో విజయ్ తాజా అప్ డేట్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story