నిజం కాబోతున్న విజయ్ మాటలు.. "లైగర్" ప్రీ రిలీజ్ బుకింగ్స్ తో షాక్ ఇస్తున్న..

"లైగర్" ప్రీ రిలీజ్ బుకింగ్స్ తో షాక్ ఇస్తున్న విజయ్ దేవరకొండ

Arun Chilukuri
Updated on: 24 Aug 2022 3:45 PM IST
Liger Movie Pre-release Bookings
X

నిజం కాబోతున్న విజయ్ మాటలు.. "లైగర్" ప్రీ రిలీజ్ బుకింగ్స్ తో షాక్ ఇస్తున్న..

Liger Movie: విజయ్ దేవరకొండ నటించిన ప్యాన్ ఇండియన్ సినిమా "లైగర్" రేపు అనగా ఆగస్టు 25 న థియేటర్లలో విడుదలవుతుంది. విజయ్ దేవరకొండ కెరియర్ లో మొట్టమొదటి ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది.

అయితే గత కొంతకాలంగా బాయికాట్ బాలీవుడ్ బాయ్ కాట్ లైగర్ వంటి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై మాత్రం అవి ప్రభావం చూపించలేకపోయాయి. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. విజయ్ దేవరకొండ కూడా సినిమా గురించి మాట్లాడుతూ పలు సందర్భాల్లో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ ఆడిస్తుంది అంటూ కామెంట్లు చేశారు.

అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొంతమంది కొట్టి పారేసినప్పటికీ ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మాత్రం విజయ్ దేవరకొండ మాటల్లో నిజం ఉందని అనిపిస్తోంది. ఎవరూ ఊహించినటువంటి విధంగా "లైగర్" సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సినిమా టికెట్లు ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుందని సినిమా విడుదలకి ముందే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story