Liger Movie: పూరిని వెంటాడుతున్న లైగర్.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ధర్నా..

Liger Movie Flop Exhibitors Protest at Film Chamber
x

Liger Movie: పూరిని వెంటాడుతున్న లైగర్.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ధర్నా..

Highlights

Liger Movie: లైగర్ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ ను వెంటాడుతూనే ఉంది.

Liger Movie: లైగర్ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ ను వెంటాడుతూనే ఉంది. సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసి ఏడాది అవుతున్నా పూరీని మాత్రం ఆ చేదు జ్ఞాపకం ఎగ్జిబిటర్ల రూపంలో వెంటాడుతోంది. లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో లైగర్ చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్న పూరిజగన్నాథ్ నష్టాలను కొంత భరించేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇచ్చిన హామీను పూరజగన్నాథ్ నెరవేర్చలేదు.

ప్రస్తుతం పూరిజగన్నాథ్ లైగర్ చేదు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి తన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో కలిసి ఆ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాని మే15న ప్రకటించబోతున్నారు. ఈ తరుణంలోనే లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయండి అంటూ ఎగ్జిబిటర్స్, లీజర్స్ అసోసియేషన్ ఫిలిమ్ ఛాంబర్ ముందు రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు. లైగర్ సినిమాతో చాలా కష్టాల్లో కూరుకుపోయామని..తమకు రూ.9కోట్లు తిరిగిఇస్తానని పూరీ హామీ ఇచ్చారని కానీ ఆరు నెలలు గడిచినా..ఇంతవరకు ఒక పైసా ఇవ్వలేదని లీజర్లు ఆరోపిస్తున్నారు. మరి, ఈ దీక్షపై పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories