Saroja Devi Death: ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత

Legendary Actress Saroja Devi Passes Away At 87
x

Saroja Devi Death: ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత

Highlights

Saroja Devi Death: ప్రముఖ సినీ నటి సరోజాదేవి (87) సోమవారం ఉదయం తన బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Saroja Devi Death: ప్రముఖ సినీ నటి సరోజాదేవి (87) సోమవారం ఉదయం తన బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారత సినీ రంగానికి అపూర్వమైన నటిగా నిలిచిన ఆమె, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.

1942లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి, చిన్న వయసులోనే నటనపై ఆసక్తి కనబరిచి, 13ఏళ్లకే సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ల వంటి దిగ్గజులతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు.

200కు పైగా సినిమాల్లో నటించిన సరోజాదేవి, తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి హిట్‌ సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె అభినయ పటిమ, సహజ నటనకు సినీ ప్రియులు ఇప్పటికీ అభిమానులు. సరోజాదేవి మృతి వార్తతో సినీ పరిశ్రమ, అభిమానులు, సహచర నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన సేవలను, నటనను చిరకాలం గుర్తు చేసుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories