బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇక లేరు!

బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇక లేరు!
x
Highlights

భారతీయ సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.

భారతీయ సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. సౌమిత్ర ఛటర్జీ అక్టోబర్‌ 5న కరోనా వైరస్‌ బారిన పడడంతో అయనని కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ అయన చికిత్స పొందుతూ అక్టోబర్‌ 14న కరోనా నుంచి కోలుకున్నారు.

అయితే ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడడంతో అయన మళ్ళీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో అయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇండియాన్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు ఛటర్జీ.. అయన సేవలకి గాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్‌‌ , 2012లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. అయన ఇక లేరు అనే విషయాన్నీ తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories