Vakeel Saab Producers: వ‌కీల్ సాబ్ మూవీపై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు

Vakeel Saab Producers: సినిమాలోని ఓ సీన్ లో తన ఫోన్‌ నంబర్‌ను చూపించారంటూ ఫిర్యాదు చేశారు.

Samba Siva Rao
Updated on: 3 May 2021 1:51 PM IST
Vakeel saab Movie
X

వకీల్ సాబ్ ఫైల్ ఫోటో 

Vakeel Saab Producers: మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ మూవీ ఏప్రీల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 30 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా వ‌కీల్ సాబ్ మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా మీద అభ్యంతరం తెలుపుతూ ఓ వ్య‌క్తి పంజాగుట్ట పీఎస్ ను ఆశ్ర‌యించారు.

'వకీల్ సాబ్' సినిమాలోని ఓ సీన్ లో తన ఫోన్‌ నంబర్‌ను చూపించారంటూ ఫిర్యాదు చేశారు. సుధాకర్ అనే వ్య‌క్తం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఓ స‌న్నీవేశంలో త‌న ఫోన్ నెంబ‌ర్ ప్ర‌ద‌ర్శించారంటూ ఫిర్యాదులో పెర్కొన్నారు. తన అనుమతి లేకుండానే ఫోన్‌ నంబర్‌ను డిస్ ప్లే చేసార‌ని.. ఎంతో మంది తరచూ ఫోన్లు చేస్తూ తనకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపాడు.

కొందరైతే నోటికొచ్చినట్లు తిడుతున్నారని సుధాకర్ వాపోయాడు. ఇప్పటికే ఈ విషయంపై బాధితుడి సుధాకర్ తరపున‌ లాయర్ ఈ చిత్ర నిర్మాతలకు లీగల్‌ నోటీసులు పంపాడు. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.

ఈ విడుద‌ల విష‌యంతో టికెట్స్ ధ‌ర అంశం పెద్ద ర‌చ్చ‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో వివాద వ‌కీల్ సాబ్ ను చూట్టుముట్టుంది. గ‌త నెల 30 నుంచి వ‌కీల్ సాబ్ అమెజాన్ ప్రై వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. వ‌కీల్ సాబ్ ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ సమర్పణలో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య, శృతి హాసన్‌ ముఖ్య పాత్రలు పోషించారు.థమన్‌ సంగీతం అందించాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story