నా డ్రీం సగం తిరిపోయినట్టే.. దేవి ఎమోషనల్ పోస్ట్!

నా డ్రీం సగం తిరిపోయినట్టే.. దేవి ఎమోషనల్ పోస్ట్!
x

devi sri prasad

Highlights

Devi Sri Prasad : టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు.. చాలా చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్

Devi Sri Prasad : టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు.. చాలా చిన్న వయసులో మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవిశ్రీప్రసాద్ చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. టాప్ హీరోలందరికి ఇప్పుడు దేవి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. అయితే ఇనేళ్ళ దేవికి మాత్రం ఒక కోరిక అలాగే ఉండిపోయింది. తన గురువు మాండలిన్ శ్రీనివాస్‌తో కలిసి సాంగ్ కంపోజ్ చేయాలని ఎన్నాళ్లుగానో అనుకుంటున్నారు. అయితే ఆ కోరిక దేవికి నెరవేరలేదు.. మాండలిన్ శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం పరమపదించడంతో దేవికి ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ కోరిక సగం తిరిగిపోయిందని దేవి అంటున్నాడు. ఈ మేరకు దేవి పోస్ట్ పెట్టాడు.

"మాండలిన్‌ శ్రీనివాస్‌ గారిని కంపోజిషన్‌ చేయాలన్నది నా డ్రీమ్.. కానీ ఆయనపై ఉన్న గౌరవంతో ఎప్పుడూ కూడా అడిగే ధైర్యం చేయలేదు. ఒకవేళ నేను అడిగి ఉంటే అయన నాకు ఒప్పుకునేవారేమో.. ఇక అయన పరమపదించిన తర్వాత ఇటీవల ఆయన సోలో మాండలిన్ ట్రాక్ విన్నాను.. అందులో కొంత భాగాన్ని ఆర్కెస్ట్రా చేసి నా గురువుకు అంకితమివ్వాలని అనుకున్నాను.. ఇదే విషయాన్ని అయన సోదరుడు రాజేశ్‌ కి చెప్పగా అయన ఒప్పుకుని ఆ ట్రాక్‌ ఇచ్చారు. గురువు గారి కంపోజిషన్‌కు శిష్యుడినైన తాను ఆర్కెస్ట్రా ఇవ్వడంతో నా కల సగం నెరవేరినట్లేనని దేవి అన్నాడు.. ఇక లెగసీ ఫ్రమ్ అన్నయ్య ఆల్బమ్' అంటూ తన కంపోజింగ్‌ను దేవీశ్రీ ప్రసాద్ యూట్యూబ్‌ ద్వారా విడుదల చేశారు.

ఇక ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఇక తెలుగులో అయితే ఉప్పెన, రంగ్ దే, పుష్ప సినిమాలు విడుదలకి సిద్దం అవుతున్నాయి.Show Full Article
Print Article
Next Story
More Stories