Ram Charan Photos: లీక్ అయిన రామ్ చరణ్ ఫోటోలు

Ram Charan Photos: లీక్ అయిన రామ్ చరణ్ ఫోటోలు

Rama Rao
Published on: 11 May 2022 1:16 PM IST
Leaked Ram Charan RC15 Movie Photos | Telugu News
X

Ram Charan Photos: లీక్ అయిన రామ్ చరణ్ ఫోటోలు

Ram Charan Photos: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆచార్య" సినిమా తో డిజాస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారు. #ఆర్సీ15 అనే టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కోలీవుడ్ యాక్టర్ మరియు డైరెక్టర్ ఎస్.జె.సూర్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో ఆర్కే బీచ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మూవీ యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. దానికి కారణం రామ్ చరణ్ ఫోటోలు లీక్ కావడం. రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుండగా, చెర్రీ పంచెకట్టు లుక్ లీకైంది. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. అమృత్ సర్‌లో కాలేజ్ సీన్లు కూడా లీక్ అవ్వడంతో చిత్ర బృందం షాక్ అయింది. రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ నడి రోడ్డు మీద డాన్స్ వేస్తోన్న వీడియో కూడా వైరల్ అవుతోంది. చూస్తుంటే అది సాంగ్ షూటింగ్‌లా అనిపిస్తోంది. ట్రాఫిక్ పోలీస్ తో గొడవ పడి, బోర్డును కూడా పీకి డాన్స్ వేశాడు చెర్రీ. ఈ వీడియోను షేర్ చేస్తూ అభిమానులు ఖుషీ సినిమాలోని "యే మే రా జహా" అనే పాటతో సింక్ చేస్తున్నారు. అప్పుడు బాబాయ్ చేయగా ఇప్పుడు అబ్బాయ్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story