అమృతం 2 : అంజి పాత్రలో ఎవరంటే ?

అమృతం 2 : అంజి పాత్రలో ఎవరంటే ?
x
Highlights

తెలుగు బుల్లితెరపైన 'అమృతం' సీరియల్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అమృతం అనే హోటల్ లో ఓ ఇద్దరు స్నేహితులు,

తెలుగు బుల్లితెరపైన 'అమృతం' సీరియల్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అమృతం అనే హోటల్ లో ఓ ఇద్దరు స్నేహితులు,ఓ సర్వర్, వీరికి ఓ ఇంటి ఓనర్ వీరి మధ్య నడిచే కథ కామెడీ అభిమానులకు పొట్టచెక్కలైయ్యేలా నవ్వించింది. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఇంకా చెప్పాలంటే అమృతం అనేది వారి ఇంటి పేరుగా మారిపోయింది. గుండు హనుమంత రావు(అంజి), హర్షవర్ధన్(అమృతం), రాగిణి(శాంత), శివనారాయణ(అప్పాజీ), వాసు ఇంటూరి(సర్వం) తదితరులు నటించిన ఈ సీరియల్ కి మంచి పేరుతో పాటు మంచి టీఆర్పీని కూడా సొంతం చేసుకుంది.

డైలీ ప్రేక్షకులను అలరించే ఈ సీరియల్ ఆ తరవాత యూ ట్యూబ్ లో కూడా ప్లే అవుతూ వచ్చింది. అయితే తాజాగా యూ ట్యూబ్ లో నుంచి వీటిని తీశేశారు. అయితే దీనికి సరైన కారణమే ఉంది. అమృతం సీరియల్ ఎపిసోడ్లు అన్నింటినీ జీ-5 ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ కొనేసింది. తన యాప్ లో లోడ్ చేసేసింది.

అంతేకాకుండా ఇప్పుడు ఈ సీరియల్ కి కొనసాగింపుగా అమృతం 2 అంటూ వెబ్ సిరీస్ ను తయారు చేసే పనిలో పడింది. మళ్లీ గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయిపోయారు. ఇందులో కూడా అంజి, సర్వం, అప్పాజీ ఇలా అన్ని పాత్రలు ఉంటాయి. అయితే ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తూ వచ్చిన గుండు హనుమంతరావు ప్రస్తుతం లేరు కాబట్టి అయన పాత్రలో సీనియర్ కమెడియన్ ఎల్ బి శ్రీరామ్ నటించబోతున్నారు. ఇక మిగిలిన వారు అమృతం 2 లో కూడా కొనసాగనున్నారు.

ఇప్పటివరకు రచయితగా, కమెడియన్ గా ఆకట్టుకున్న ఎల్ బి శ్రీరామ్ తన సొంత యూ ట్యూబ్ ఛానల్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ వస్తున్నారు. ఇప్పుడు అమృతం 2 అంటూ వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు సిద్దం అయ్యారు. అంజీ(ఆంజనేయులు) పాత్రలో అయన ఏ మేరకు మెప్పిస్తారు అన్నది చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories