హీరోయిన్ ల‌క్ష్మీ రాయ్ కి పితృవియోగం!

హీరోయిన్ ల‌క్ష్మీ రాయ్ కి పితృవియోగం!
x
Highlights

టాలీవుడ్లో విషాదం నెలకొంది.. ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ తండ్రి రామ్ రాయ్ మరణించారు... ఈ విషయాన్ని లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో వెల్లడించింది..

టాలీవుడ్లో విషాదం నెలకొంది.. ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ తండ్రి రామ్ రాయ్ మరణించారు... ఈ విషయాన్ని లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.. జీవితంలో ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో నాకు నేర్పింది మీరే.. ఇప్పుడు మీరు లేరనే మాటని నేను అంగీకరించలేక పోతున్నాను.. మిమ్మల్ని కాపాడుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను .. కానీ రక్షించుకోలేకపోయాను.. మీరు ప్రేమించ‌నంత‌గా న‌న్ను ఎవ‌రు ప్రేమించ‌లేదు. మీరు పై నుంచి నన్ను ఆశీర్వదిస్తారని, ముందుకు నడిపిస్తారని నాకు తెలుసు.. మిస్ యు నాన్న అంటూ భావోద్వేగానికి లోనైంది లక్ష్మీ రాయ్..

ఇక లక్ష్మీరాయ్ సినిమాల విషయానికొస్తే.. శ్రీకాంత్ హీరోగా వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ పరిచయమైంది లక్ష్మీరాయ్.. తర్వాత అధినాయకుడు, నీకు నేను మొదలగు సినిమాల్లో నటించింది... హీరోయిన్ గా పెద్దగా క్లిక్ కానీ లక్ష్మీ రాయ్.. ఐటమ్ సాంగ్స్ తో బాగా పాపులర్ సంపాదించుకుంది... రవితేజ బలుపు, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మొదలగు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది లక్ష్మీ రాయ్... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో లక్ష్మీ రాయ్ హీరోయిన్ గా నటించింది.. ఇటీవలే 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది లక్ష్మి రాయ్..



Show Full Article
Print Article
Next Story
More Stories