జోరు చూపిస్తున్న 'కాంచన 3'

జోరు చూపిస్తున్న కాంచన 3
x
Highlights

కామెడీ చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేది 'ముని' సిరీస్ గురించి. అలాంటి ముని సిరీస్ లోని నాలుగవవ భాగం గా, కాంచన సిరీస్ లో మూడవ భాగం గా 'కాంచన 3'...

కామెడీ చిత్రాలు అంటే ముందుగా గుర్తొచ్చేది 'ముని' సిరీస్ గురించి. అలాంటి ముని సిరీస్ లోని నాలుగవవ భాగం గా, కాంచన సిరీస్ లో మూడవ భాగం గా 'కాంచన 3' సినిమా ఈ మధ్యనే విడుదలైంది. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. రెండవ వారంలో కూడా అదే జోరును కనబరుస్తూ ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి వారంలో 'కాంచన 3' నైజాం ఏరియాలో 4.60 కోట్ల షేర్ ను నమోదు చేసుకుంది. ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే 80 లక్షల షేర్ ను వసూలు చేసింది.

కేవలం నిజాం ఏరియా లో మాత్రమే 5.40 కోట్ల రూపాయలను వసూలు చేసింది 'కాంచన 3'. ఒకవైపు నాని 'జెర్సీ' సినిమా కూడా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటూ ఉండగా 'కాంచన 3' సినిమా సినిమా కూడా మంచి వసూళ్ళలో ముందుకు దూసుకెళుతోంది. రాఘవ లారెన్స్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాక ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిక్కీ తంబోలి, ఓవియ, మరియు వేదిక ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సన్ పిక్చర్స్ మరియు రాఘవేంద్ర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి డూపాడూ సంగీతాన్ని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories