Lavanya Tripati: లావణ‌్య త్రిపాఠి లిప్లాక్ సీన్.. హద్దులు చెరిపేసుకుందా..?

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్యా త్రిపాఠి.

Samba Siva Rao
Published on: 27 Jan 2021 5:27 PM IST
Lavanya Tripati: లావణ‌్య త్రిపాఠి లిప్లాక్ సీన్.. హద్దులు చెరిపేసుకుందా..?
X

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్యా త్రిపాఠి ఇప్పటి వరకు 16 సినిమాలు చేసింది. అయితే ఆమె నటించిన చిత్రాలు ఏవీ పెద్దగా సక్సెస్స్ ఇవ్వలేదు. అయితే నాని హీరోగా చేసిన భలే భలే మగాడివోయ్, కింగ్ నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలతో గుర్తింపు పొందింది. గత ఏడాది నిఖిల్ నటిచింన అర్జున్‌ సురవరం సినిమా కూడా కాస్తా పరవాలేదనిపించింది. తాజాగా లావణ్య నటిచింన రెండు చిత్రాలు 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు కబురు చల్లగా విడుదలకు రెడీగా ఉన్నాయి.

అయితే లావణ్య ఇప్పటి వరకు ఎలాంటి గ్లామర్ షో చేయలేదు. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌ ట్రైలర్ మంగళవారం విడుదలైంది. హాకీ క్రీడా నేపథ్యంలో ఈ మూవీ సాగనుంది. అయితే ఈ మూవీ ట్రైలర్ లో లావణ్య.. సందీప్‌ను లిప్‌లాప్‌ చేస్తున్నట్లు సీన్ ఒకటి ఉంది. లావణ్యా త్రిపాఠి ఈ సారి తన హద్దులు చెరిపేసుకొని ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధపడిందా? అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఏ1 ఎక్స్‌ప్రెస్ లో లవ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ, రాహుల్ రామ‌కృష్ణ, పోసాని కృష్ణముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్య,మ‌హేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్‌, భూపాల్‌, సుద‌ర్శన్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి, ఖ‌య్యుమ్‌ ముఖ‌్య పాత్రల్లో నటించారు. హిపాప్ బాణీలు అందించాడు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story