Lavanya Tripathi: మహేష్ బాబుతో నటించే అవకాశం అందుకున్న లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయనున్న అందాల రాక్షసి

admin1
Updated on: 18 Nov 2021 6:00 PM IST
Lavanya Tripathi get a Chance to Act With Mahesh Babu
X

సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే అవకాశం అందుకున్న లావణ్య త్రిపాఠి(ఫైల్ ఇమేజ్)

Lavanya Tripathi: "అందాల రాక్షసి" సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠీ మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెట్టింది. ఒకవైపు గ్లామర్ తో మాత్రమేకాక మరోవైపు నటనతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది లావణ్య త్రిపాటి. కానీ ఇప్పటికే బోలెడు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన లావణ్య త్రిపాటికి స్టార్ హీరోలతో మాత్రం నటించే అవకాశం దొరకలేదు. పెద్ద దర్శకుల నుంచి ఈమెకు అవకాశాలు రావడం లేదు. అందుకే కేవలం మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది లావణ్య.

ఈ ఏడాది "చావు కబురు చల్లగా" మరియు "ఏ వన్ ఎక్స్ప్రెస్" సినిమాలలో హీరోయిన్ గా కనిపించింది లావణ్య త్రిపాటి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్నప్పటికీ ఈ రెండు ఆమె కెరియర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు అని చెప్పుకోవాలి. కానీ తాజా సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి కి ఇప్పుడు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలో లావణ్య త్రిపాఠి కి అవకాశం దొరికింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాటి సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. మరి ఈ సినిమా ఈమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సి ఉంది.

admin1

admin1

Next Story