RC15: చెర్రీ-శంకర్ సినిమాలో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళేనా?

RC15: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Published on: 13 March 2021 6:05 PM IST
Crucial Updates on Ram Charan Shankar Movie
X

హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్

RC15: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అప్పుడే చాలా హోప్స్ క్రియోట్ అవుతున్నాయి. శంకర్ సినిమాలో ఓ రేంజ్ లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తరువాత, శంకర్ ఈ సినిమా చేస్తున్నాడు. అది కూడా భారతీయుడు 2 ని పక్కన పెట్టి మరీ పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ , అలాగే మ్యాజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ తో చర్చలు చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు లేదు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూలైలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించాలని డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ శంకర్ ఇప్పటికే స్క్రిప్ట్ పనిని పూర్తి చేశాడు. ఫ్రీ-ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టె పనిలో ఉన్నాడు. ఈలోపు రామ్ చరణ్ RRR షూటింగ్ పూర్తి చేస్తాడని సమాచారం. శంకర్ సినిమా ప్రారంభమయ్యేలోపు ఆచార్య సినిమాలో తనభాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నాడని టాక్. ఆచార్య సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story