కాంచన సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా

కాంచన సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా
x
Highlights

'ముని' సిరీస్లో నాలుగో భాగంగా 'కాంచన' సిరీస్ లో మూడవ భాగంగా 'కాంచన 3' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య...

'ముని' సిరీస్లో నాలుగో భాగంగా 'కాంచన' సిరీస్ లో మూడవ భాగంగా 'కాంచన 3' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన రాఘవ లారెన్స్ దర్శకత్వం కూడా వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. కానీ ఆ టీజర్ అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కేవలం లారెన్స్ ఒక ముసలి వేషం వేసుకొని ఉన్న గెటప్ తప్ప అందులో కొత్తగా ఏమీ కనిపించక పోవడం ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది. ఒకపక్క టీజర్ నెగెటివ్ రెస్పాన్స్ అందుకుంటుండగా మరొకవైపు రాఘవ లారెన్స్ కాంచన పేరుతో 10 భాగాలు తీసినా హిట్ అవుతాయని చెప్పుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగానే కనిపిస్తోంది.

నిజానికి 'ముని' సినిమా టైంలో హారర్ కామెడీ లు చాలా తక్కువ కాబట్టి అప్పుడు ఒక ట్రెండ్ ని సెట్ చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత 'కాంచన', అని 'కాంచన 2 (గంగా)' అని వేరే పేర్లతో సినిమాలు తీశాడు రాఘవ లారెన్స్. అవి కూడా పర్వాలేదనిపించాయి. కానీ ప్రస్తుతం ప్రేక్షకులు హారర్ కామెడీ ల పైన పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. వచ్చినా సరే అవి హిట్ అయిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమాకి పోటీగా కాంచన సినిమా బరిలోకి దిగనుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories