త్రివిక్రమ్ దర్శకత్వంలో.. 'ప్రభాస్'?

త్రివిక్రమ్ దర్శకత్వంలో.. ప్రభాస్?
x
Prabhas, Trivikram Srinivas (File Photo)
Highlights

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మాటలతో మంత్రం వేసే త్రివిక్రమ్.. వీరిద్దరూ కలిస్తే.. అసలు ఆ కాంబినేషన్ ఊహే అదిరిపోతోంది కదూ. ఇది నిజం అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మామూలుగా నటులకి కథ నచ్చితే ఎంత సాహసం చేయడానికైనా వెనకాడరు. అటువంటిది ప్రభాస్ రాజమౌళి చెప్పిన కథ విని 'బాహుబలి' ది బిగినింగ్, 'బాహుబలి' ది కంక్లూషన్ కోసం సుమారు ఐదు సంవత్సరాలు తన డేట్స్ ను కేటాయించాడు. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత సృష్టించిన రికార్డ్స్ గురించి మనకు తెలిసిందే. పది సినిమాలు చేసినా రానంత క్రేజ్ బాహుబలి చిత్రంతో సాధ్యం చేసుకున్నారు ప్రభాస్. తరువాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో 'సాహూ' చిత్రం చేసాడు.

ఈ చిత్రంతో తెలుగులో నిరాశ పరిచిన హిందీలో మాత్రం రికార్డులను సృష్టించింది. అప్పటి నుంచి స్లో అండ్ స్టడీగానే ప్రభాస్ జర్నీ సాగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాక్రిష్ణ‌తో పీరియాడిక్ లవ్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. 'సాహో' చిత్రం తరువాత ప్రభాస్ ఈ చిత్రంతో గట్టి హిట్ కొట్టేందుకు పక్క ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత ' మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు ప్రభాస్.

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. అయితే ఈ జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేరబోతున్నారా? అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌‌తో 'అల వైకుంఠపురములో' సినిమాను తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు త్రివిక్రమ్. అయితే ప్రభాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రభాస్ కోసం ఎప్పటినుంచో కథ రెడీగా ఉందని, ప్రభాస్ బిజీ కావటం వలన మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని.. త్వరలోనే త్రివిక్రమ్ ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రెండు చిత్రాల షూటింగ్ కంప్లీట్ కావటానికి 2022 వరకూ టైం పట్టే అవకాశం ఉండటంతో.. ఆ చిత్రాలు కంప్లీట్ అయిన తరువాతే ప్రభాస్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు ఆ చిత్రానికి ఈ చిత్రానికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories