కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్
x
Highlights

విడుదలకు ముందే బోలెడు వివాదాల్లో చిక్కుకున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎట్టకేలకు మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ గా రాంగోపాల్...

విడుదలకు ముందే బోలెడు వివాదాల్లో చిక్కుకున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎట్టకేలకు మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ గా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా తెలంగాణ మరియు ఓవర్సీస్ లో సైతం మంచి కలెక్షన్లను అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం నైజాం ఏరియాలో మాత్రమే 1.8 కోట్లను వసూలు చేసిందని తెలుస్తోంది.

గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మ సినిమాలని డిజాస్టర్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో వచ్చిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కలెక్షన్లు బాగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో విడుదల కావాల్సిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా విడుదల అయితే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల అంచనా. వర్మ మార్కెట్ టి పోలిస్తే ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దీప్తి బాలగిరి, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories