Lahari: బిగ్ బాస్ తో లహరి దశ తిరిగినట్టేనా?

* లహరి పై కురుస్తున్న ఆఫర్ల వర్షం * ఈమె నితిన్ హీరోగా నటించిన "మేస్ట్రో" సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది.

admin1
Updated on: 14 Oct 2021 12:43 PM IST
Lahari Getting Many Offers After Coming from BigBoss Show
X

లహరి (ఫోటో-ఇంస్టాగ్రామ్ )

Lahari: బిగ్ బాస్ పుణ్యమా అని అప్పటిదాకా పేరు కూడా తెలియని కొందరు టీవీ సెలబ్రిటీ లుగా మారిపోయారు. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాక ఆఫర్లు వస్తాయో లేదో తెలియదు కానీ ఫేమ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ మధ్యనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చి మంచి ఆఫర్లను అందుకుంటున్న భామ లహరి శేరి. బిగ్బాస్ ముందు వరకు ఈమె పేరు కూడా చాలామందికి తెలీదు. బిగ్ బాస్ హౌస్ కి రాకముందు ఈమె నితిన్ హీరోగా నటించిన "మేస్ట్రో" సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది.

పోషించింది చిన్న పాత్రే అయినప్పటికీ, ప్రేక్షకులు ఈమెను బాగానే గుర్తు పడుతున్నారు. అయితే తాజా సమచారం ప్రకారం లహరి కి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక బోలెడు ఆఫర్లు వస్తున్నాయట. బిగ్ బాస్ లో ఉన్నపుడు కూడా తన గ్లామర్ తో ఎప్పుడూ అందరినీ ఆకట్టుకునే లహరి ఎలిమినేట్ అవడం అభిమానులు ఊహించని పరిణామం అనే చెప్పుకోవాలి. ఏదేమైనా ఇంటినుండి బయటకి వచ్చాక మాత్రం లహరి దశ తిరిగింది అని, ఆమెపై ఆఫర్ల వర్షం కురుస్తోంది అని టాక్ నడుస్తోంది. ఇక లహరి కి ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించే అవకాశం కూడా వచ్చింది అని సమాచారం.

admin1

admin1

Next Story