తెలుగుదనం ఉట్టిపడేలా 'లగ్గం' సినిమా.. షూటింగ్ ఫినిష్: దర్శకుడు రమేష్

Laggam: "ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అన్నారు పెద్దలు "ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి" అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల.

Arun Chilukuri
Published on: 4 May 2024 1:29 PM IST
Laggam Movie Shooting Completed
X

తెలుగుదనం ఉట్టిపడేలా 'లగ్గం' సినిమా.. షూటింగ్ ఫినిష్: దర్శకుడు రమేష్

Laggam: "ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అన్నారు పెద్దలు "ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి" అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా నిన్నటితో లగ్గం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది.

“మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుందని” ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. "లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథ చిత్రమని" రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎల్.బి. శ్రీరామ్,రోహిణి, రఘు బాబు నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్గా చెప్పారు.

పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే!!! ఒక్కో ప్రాంతంలో ఒక్కోక్క ఆచారం... ఈ లగ్గం సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారు. చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారు, బేబీ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి లగ్గం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. బొంతల నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story