Vidyullekha Raman: "బికినీ వేసుకుంటే విడాకులు తీసుకోవాలా" అంటూ ఫైర్ అయిన నటి

* ట్రోలర్ల నోరు మూయించిన కమెడియన్ విద్యుల్లేఖ

admin1
Updated on: 7 Oct 2021 2:00 PM IST
Lady Comedian Vidyullekha Raman Fires on Social Media Trolls
X

విద్యుల్లేఖ (ట్విట్టర్ ఫోటో)

Vidyullekha Raman: ప్రముఖ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ ఈ మధ్యనే ఒక ఫిట్నెస్ ట్రైనర్ సంజీవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న పెళ్లితో ఒక్కటైన ఈ జంట మాల్దీవ్స్ లో హనీమూన్ జరుపుకున్నారు. అయితే హనీమూన్లో విద్యుల్లేఖ తన బికినీ ఫోటోని షేర్ చేస్తూ "నాకు సంవత్సరానికి రెండు సార్లు ఆరు నెలల చొప్పున వెకేషన్ కావాలి" అంటూ పోస్ట్ చేసింది. ఈమెను చూసిన నెటిజన్లు విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నావ్ అంటూ ఆమె ఆమెను ట్రొల్ చేశారు. దీంతో విసిగిపోయిన విద్యుల్లేఖ రామన్ సోషల్ మీడియా ద్వారానే వారి నోరులు మూయించే జవాబు ఇచ్చింది.

"1920 అంకుల్స్ అండ్ ఆంటీస్ ఇక్కడినుంచి వెళ్లిపోండి. 2021 లోకి రండి. బికినీ వేసుకున్నందుకు నన్ను విడాకులు ఎప్పుడు అని అడుగుతున్నారు. బికినీ వేసుకోవడం విడాకులకి కారణం అయితే మంచి బట్టలు వేసుకున్న ఆడవాళ్ళందరూ భర్తలతో సంతోషంగా ఉన్నట్టేనా? మీ సంకుచిత మనస్తత్వాన్ని నేను మార్చలేను. సంజయ్ లాంటి భర్త దొరకడం నాకు నిజంగా నా అదృష్టం. తను కూడా ఈ కామెంట్లకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు కానీ నేను మాత్రం ఊరికే ఉండలేక పోతున్నాను. జీవించండి ఇతరులను జీవించనివ్వండి," అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది విద్యుల్లేఖ.

admin1

admin1

Next Story