గోపీచంద్ సినిమా లో కనిపించనున్న సీనియర్ నటి

Kushboo Signed By Gopichand Movie | Telugu Movie News
x

గోపీచంద్ సినిమా లో కనిపించనున్న సీనియర్ నటి

Highlights

గోపీచంద్ సినిమా లో కనిపించనున్న సీనియర్ నటి

Gopichand-Kushboo: ఈ మధ్యనే "సిటిమార్" సినిమాలో కనిపించిన గోపీచంద్ తాజాగా ఇప్పుడు "పక్కా కమర్షియల్" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మారుతీ డైరెక్షన్లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మేలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు గోపీచంద్ తన తదుపరి సినిమాని శ్రీవాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే లక్ష్యం మరియు లౌక్యం సినిమాలలో శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన గోపీచంద్ మూడవసారి ఈ డైరెక్టర్ తో చేతులు కలపనున్నారు. #గోపీచంద్30 అని పిలవబడుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాల్టి నుండి మొదలైంది హైదరాబాద్ పరిసరాల్లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ప్రముఖ సీనియర్ నటి ముఖ్య పాత్ర పోషించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ఖుష్బూ సుందర్. తాజాగా ఈ విషయాన్ని ఈమె చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. "అజ్ఞాతవాసి" సినిమాలో కనిపించిన ఖుష్బూ తాజాగా ఇప్పుడు శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఆడాళ్లు మీకు జోహార్లు" సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. మరోవైపు గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories