Samantha: సమంత పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన కూకట్‌పల్లి కోర్టు

Samantha: మరోసారి వాదనలు వినిపించిన సమంత తరపు న్యాయవాది

admin1
Updated on: 28 Oct 2021 2:11 PM IST
Kukatpalli Court Reserve the Samantha Petition Judgement
X
సమంత తీర్పును రిజర్వు చేసిన కూకట్పల్లి కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Samantha: సమంత పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. అంతకుముందు సమంత తరపు న్యాయవాది తన క్లయింట్‌ ప్రతిష్ట దెబ్బతీసేలా పోస్టింగ్స్‌ చేసిన యూట్యూబ్‌ ఛానెల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. చైతూతో విడిపోతున్నట్లు ట్విట్టర్‌ వేదికగా ప్రకటించగానే సమంతను టార్గెట్‌ చేస్తూ విపరీతమైన ట్రోల్స్‌ చేశారన్నారు. ఇలాంటి వార్తలు భవిష్యత్‌లో కూడా రాయకుండా పర్మినెంట్‌ ఇంజెక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలంటూ కోర్టును కోరారు ఆ‍యన. గతంలో శిల్పాశెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు సమంత తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు.

admin1

admin1

Next Story