ఇంకొంచెం టైం కావాలి అంటున్న కృతి శెట్టి

Krithi Shetty: ప్రమోషన్స్ కి రావడానికి ఇబ్బంది పడుతున్న కృతి శెట్టి

Jyothi
Published on: 18 Aug 2022 10:50 AM IST
Kriti Shetty Says She Needs Some More Time
X

ఇంకొంచెం టైం కావాలి అంటున్న కృతి శెట్టి 

Krithi Shetty: "ఉప్పెన" సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తరువాత "శ్యామ్ సింగారాయి", "బంగార్రాజు" వంటి సినిమాలతో కూడా మంచి హిట్లు అందుకున్న ఈమె కెరియర్ కు రెండు డిజాస్టర్ సినిమాలతో బ్రేకులు పడ్డాయి. ఈ మధ్యనే రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా విడుదలైన "ది వారియర్" సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ మధ్యనే నితిన్ హీరోగా నటించిన "మాచర్ల నియోజకవర్గం" సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది కృతి శెట్టి. కానీ ఈ సినిమాతో కూడా మంచి మార్కులు వేయించుకోలేకపోయింది.

తాజాగా కృతి శెట్టి తన ఆశలన్నీ తన తదుపరి సినిమా పైన పెట్టుకుంది. సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లో విడుదల కాబోతోంది. సినిమాకి ఇంకా నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి దీంతో చిత్ర బృందం త్వరలోనే ప్రమోషన్లు మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయ్యేసరికి కృతి శెట్టి ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించడానికి కొంత ఇబ్బంది పడుతున్నట్లు, ఇంకొంత సమయం కోరుతున్నట్లు సమాచారం. కానీ ఈ మధ్యకాలంలో ప్రమోషన్లు కూడా సినిమా హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కృతి శెట్టి ని ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story