Kriti Sanon: టాలీవు‌డ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్న కృతి సనన్?

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్‌లో మహేశ్ బాబు హీరోగా నటించిన '1 నేనొక్కడినే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Venkata Chari
Updated on: 15 May 2021 3:52 PM IST
Kriti Sanon to Enter Tollywood Again in Prabhas New Movie
X

కృతి సనన్ (ఫొటో ట్విట్టర్)

Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్‌లో మహేశ్ బాబు హీరోగా నటించిన '1 నేనొక్కడినే' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొంది. కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో కనిపించడం లేదు.

నాగ చైతన్య దోచెయ్ సినిమాతో టాలీవుడ్ కి బైబై చెప్పిన ఈ నటి.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఆఫర్లు అందుకునేందుకు రెడీ అయ్యిందట. తాజా నివేదికల మేరకు.. టాలీవుడ్ లోకి గ్రాండ్‌ గా రీఎంట్రీ ఇచ్చేందుకు మంచి అవకాశం లభించినట్లు సమాచారం. రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. సినిమా విషయాలు ప్రస్తుతానికి తెలియలేదు. త్వరలోనే అధికారికంగా ప్రభాస్ సినిమాపై అప్‌డేట్ రానుంది.

ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మరికొన్నింటిని లైన్‌ లో పెట్టాడు. మరోవైపు కృతి సనన్ ప్రభాస్ సినిమానే కాక, మరో రెండు సినిమా ఆఫర్లు దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story