Prabhas: ప్రభాస్ తో పెళ్లికి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏదో ఒక రోజు సినిమా చేయాలని ప్రతి ఒక్కరి కల.

Arun Chilukuri
Updated on: 26 Nov 2022 8:46 PM IST
Kriti Sanon Says she would Marry Prabhas
X

Prabhas: ప్రభాస్ తో పెళ్లికి రెడీ అంటున్న స్టార్ హీరోయిన్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏదో ఒక రోజు సినిమా చేయాలని ప్రతి ఒక్కరి కల. ఏ సినిమాలో అయినా ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించాలని చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. అయితే తాజాగా ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవకాశం వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కృతి సనన్.

గతంలో మహేష్ బాబు సరసన "వన్ నేనొక్కడినే" సినిమాలో హీరోయిన్ గా నటించిన కృతి సనన్ హిందీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం "ఆది పురుష్" సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది ఈ భామ. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతుండగా కృతి సీత పాత్రలో కనిపించబోతోంది. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన "భేడియా" అనే సినిమాలో నటించిన కృతి సనన్ ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న కృతి సనన్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. కార్తీక్ ఆర్యన్, ప్రభాస్ మరియు టైగర్ ష్రాఫ్, వీరిలో ఎవరితో డేట్ చేస్తారు? ఎవరితో ఫ్లర్ట్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అని అడగగా కృతి సనన్ కార్తీక్ ఆర్యన్ తో ఫ్లర్ట్ చేస్తానని, టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తానని అలాగే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో తెగ వైరల్ గా మారుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story