Kriti Sanon Party: కృతిసనన్ పార్టీలో సందడి చేసిన హీరోయిన్స్

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2024 3:12 PM IST
Kriti Sanon Party: కృతిసనన్ పార్టీలో సందడి చేసిన హీరోయిన్స్
X

Kriti sanon celebrated Do Patti success party: బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ డ్యుయల్ రోల్‌లో నటించిన మూవీ దో పత్తి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్‌ను పార్టీతో ఆమె సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, ప్రగ్యా జైశ్వాల్ పాల్గొని సందడి చేశారు. నిర్మాతగా ఆమె తొలి విజయాన్ని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తనకు ప్రత్యేకమైన ఈ విజయాన్ని చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నామన్నారు కృతిసనన్. నిర్మాతగా ఇది తన తొలి ప్రయత్నమని అన్నారు. తనను సపోర్ట్ చేసి చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి కాజోల్ రాకపోవడం బాధగా అనిపించిందని తెలిపారు. ఈ సినిమాలో కాజల్ పోలీసు అధికారి పాత్రలో నటించారు.

మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస నేపథ్యంలో దో పత్తి మూవీని రూపొందించారు. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. అక్కా చెల్లెళ్లు ఒకే వ్యక్తిని ఇష్టపడడం.. చివరకు అతడిని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అతడి నుంచి వేధింపులు ఎదుర్కోవడం.. దాని నుంచి బయటపడడం కోసం ఏం చేశారనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించిన కృతిసనన్.. కొత్త టాలెంట్, భిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే దీనిని మొదలుపెట్టానని తెలిపారు. అక్టోబర్ 25న ఇది డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అక్కాచెల్లెళ్లుగా కృతిసనన్ నటనను అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇక కృతిసనన్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో జోడీగా ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ మూవీలో తన సహజ నటనతో మంచి మార్కులే సొంతం చేసుకుంది. గతంలో మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే మూవీతో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తోంది. దో పత్తి గృహ హింస అనే కాన్సెప్ట్‌ను తీసుకుని దానికి భిన్నమైన స్టోరీ లైన్‌తో ప్రేక్షకులను మెప్పించారు. అందుకే ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story