Krithi Shetty: కృతి శెట్టితో రొమాన్స్ చేయనున్న అభిరామ్ దగ్గుబాటి?

Krithi Shetty to Romance Abhiram Daggubati?
x

కృతి శెట్టి, దగ్గుబాటి అభిరామ్ (ఫొటో ట్విట్టర్) 

Highlights

Krithi Shetty: దగ్గుబాటి అభిరామ్ టాలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే.

Krithi Shetty: దగ్గుబాటి అభిరామ్ టాలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. లేడీస్ టైలర్ సినిమాకు సీక్వెల్ తో నటుడిగా ఎంట్రీ ఇద్దామనుకున్నా.. అది నెరవేరలేదు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో గ్రాండ్‌ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

తాజా సంచలనం మేరకు, ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి ని తీసుకునేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నారంట. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ నటి.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

తేజ గతంలో దగ్గుబాటి అభిరామ్ కోసం ఒక ఆసక్తికరమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. బేబమ్మ.. ప్రస్తుతం సుధీర్ బాబు, నానిలతో సినిమాలు చేస్తుంది. కోవిడ్ పరిస్థితులు తగ్గిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories