Krithi Shetty: లిప్ లాక్ తో మళ్ళీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి

Krithi Shetty: మరొక సారి వెండితెరపై లిప్ లాక్ ఇస్తున కృతి

admin1
Published on: 19 Nov 2021 7:57 PM IST
Krithi Shetty Shyam Singha Roy Lip Lock scene Goes Viral in Social Media
X
శ్యామ్ సింఘా రాయ్ టీజర్ లో లిప్ లాక్ ఇచ్చిన కృతి శెట్టి (ఫైల్ ఇమేజ్)

Krithi Shetty: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని ఈ సినిమాతో పెద్ద డిజాస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "శ్యామ్ సింగరాయి" పైనే పెట్టుకున్నాడు నాని. నాని కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే విభిన్నంగా ఉండబోతోందని మరియు నాని కూడా ఈ సినిమాలో ఒక సరికొత్త లుక్తో కనిపించబోతున్నాడు అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక ఈ సినిమా లో గ్రాండ్ విజువల్స్ ఉండబోతున్నాయని హింట్ ఇచ్చిన ఈ టీజర్ ఆఖర్లో మాత్రం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న "శ్యామ్ సింగరాయ్" టీజర్ ఆఖర్లో కృతి శెట్టి నాని కి లిప్ లాక్ ఇస్తూ కనిపించింది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ రెండవ సినిమాలో కూడా ఇలాంటి బోల్డ్ పాత్రలో కనిపించబోతూ కృతి శెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. "టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

admin1

admin1

Next Story