Krithi Shetty: తేజ ఆఫర్‌ను తిరస్కరించిన కృతి శెట్టి ?

Krithi Shetty: 'ఉప్పెన' తో కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే హిట్ కొట్టి తన సత్తాను చాటింది.

Venkata Chari
Updated on: 13 May 2021 9:45 PM IST
Krithi Shetty rejects director Teja?
X

కృతి శెట్టి (ఫొటో ట్విట్టర్)

Krithi Shetty: 'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టి తన సత్తాను చాటింది.

తన తొలి చిత్రం అద్భుతమైన విజయం సాధించడంతో.. కృతి శెట్టి తన పారితోషికాన్ని కూడా పెంచింది. రాబోయే ప్రాజెక్టుల కోసం రూ. 50 లక్షలు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. తాజాగా దర్శకుడు తేజ తన రాబోయే మూవీలో అభిరామ్ దగ్గుబాటిని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడు. రొమాంటిక్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి స్క్రిప్ట్ ఇటీవలే పూర్తయింది.

ఈ సినిమాలో నటించేందుకు కృతి శెట్టి ని అనుకున్నారంట మేకర్స్. ఈ మేరకు ఆమెను సంప్రదించగా.. ఈ ఆఫర్‌ను ఆమె తిరస్కరించారంట. కృతి శెట్టి కోసం ఫాన్సీ పే చెక్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నా.. కారణం ఏంటో తెలియదు కానీ, ఈ ఆఫర్‌ను వద్దని చెప్పిందని వార్తలు వెలువడుతున్నాయి. డైరెక్టర్ తేజా ప్రస్తుతం మరో హీరోయిన్ వేటలో పడ్డాడని తెలుస్తోంది.

మరోవైపు, కృతి శెట్టి నాని 'శ్యామ్ సింఘరాయ్', సుధీర్ బాబు నటించే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలతో బిజీగా ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story