RAPO19: రామ్ తో జతకట్టిన కృతి శెట్టి

RAPO19: ప్రముఖ దర్శకుడు లింగుసామి ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Venkata Chari
Published on: 5 March 2021 9:17 PM IST
Krithi Shetty JoinedmHero Rams News Movie RAPO19
X

రామ్, కృతి శెట్టి (ఫోటో ట్విట్టర్)

RAPO19: ప్రముఖ దర్శకుడు లింగుసామి ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ గా ఉప్పెన ముద్దుగుమ్మ కృతి శెట్టి జాయిన్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ లో మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో రామ్, లింగుసామితో పాటు, కృతి శెట్టి కూడా కనిపిస్తుంది. రామ్ హీరోగా చేస్తున్న19 వ చిత్రం ఇది. దీనికి లింగుసామి డైరెక్షన్ చేస్తుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో శ్రీనివాసా చిత్తూరి నిర్మిస్తున్నారు.

చిత్రం తెలుగు తోపాటు తమిళంలోనూ విడుదల కానుందని సమాచారం. సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో అధికారిక ప్రకటనలో వెలువడనున్నాయి.


Venkata Chari

Venkata Chari

Next Story