Krithi Shetty: మనసుకు నచ్చినప్పుడే అలా చేయాలి.. సమంతపై కృతి షాకింగ్ కామెంట్స్..

Krithi Shetty: మనసుకు నచ్చినప్పుడే అలా చేయాలి..సమంతపై కృతి షాకింగ్ కామెంట్స్..

Jyothi
Updated on: 14 May 2023 9:30 PM IST
Krithi Shetty Interesting Comments About Samantha Oo Antava Mava Song In Pushpa Movie
X

Krithi Shetty: మనసుకు నచ్చినప్పుడే అలా చేయాలి.. సమంతపై కృతి షాకింగ్ కామెంట్స్..

Krithi Shetty: మన టాలీవుడ్ లెక్కల మాస్టర్.. ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప..ఏ రేంజ్ లో హిట్టు కొట్టిందో మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్టో అంతకు మించి బాలీవుడ్ లో మోత మోగిపోయింది. పుష్పలో యాక్షన్ సన్నివేశాలే కాదు.. పాటలు సైతం ఒక ఊపు ఊపేశాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా పాటలకు కాలు కదిపారు. ఇక సినిమా అంతా ఒకెత్తైతే ఊ అంటావా పాట ఒకటి మరో ఎత్తు. సమంతపై ఎన్ని విమర్శలు వచ్చాయో అంతకు రెట్టింపు ప్రశంసలు కూడా దక్కాయి. ఈ పాటపైనే ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అక్కినేని హీరో నాగచైతన్య కాంబినేషన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ మూవీ తాజాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ సాధించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కస్టడీ సినిమాను ప్రమోట్ చేస్తూ కృతిశెట్టి పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ ఇంటరాక్షన్ లో భాగంగా పుష్పలో ఊ అంటావా మామ తరహాలో అవకాశం వస్తే చేస్తారా అని ఓ యాంకర్ అడుగగా...కృతిశెట్టి ససేమిరా అని చెప్పేసింది. ప్రస్తుతం తనకు ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచన లేదని..వాటిపై అంతగా అవగాహన లేదని..అసౌకర్యంగా అనిపించినప్పుడు ఎందుకు చేయాలని కృతి నిర్మొహమాటంగా తేల్చి చెప్పేసింది.

నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో చేసిన శ్యామ్ సింగరాయ చిత్రంలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని.. వాటిలో మనస్ఫూర్తిగా నటించలేకపోయానని కృతిశెట్టి చెప్పింది. ఇక అప్పటినుంచే మనసుకు నచ్చితేనే చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యానని.. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండడమే బెటర్ కదా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇక ఊ అంటావా పాటలో సమంత చాలా బాగా డాన్స్ చేసిందని..ఆమె ఒక ఫైర్ అంటూ సామ్ ని పొగిడింది.

Jyothi

Jyothi

Next Story