Krithi Shetty - Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో నటించనున్న ఉప్పెన బ్యూటీ

*ఈ మధ్యనే వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఉప్పెన" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

admin1
Updated on: 9 Oct 2021 12:15 PM IST
Krithi Shetty got Chance to act With Stylish Star Allu Arjun Upcoming Movie
X

కృతి శెట్టి (ట్విట్టర్ ఫోటో)

Krithi Shetty - Allu Arjun: ఈ మధ్యనే వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన "ఉప్పెన" సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న కృతి ఈ మధ్య వరుస ఆఫర్లు ను అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం కృతి శెట్టికి ఒక స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. ఆ స్టార్ హీరో ఎవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ హీరోగా నటిస్తున్న "ఐకాన్" సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

డీజే, అల వైకుంఠపురంలో, సినిమాల తర్వాత పూజా హెగ్డే బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు కృతి శెట్టి ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం నార్త్ ఇండియాలో జరగబోతుంది. స్టార్ హీరోతో సినిమా కాబట్టి కృతి శెట్టికి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుందని అభిమానులు సంతోషిస్తున్నారు.

admin1

admin1

Next Story