Krithi Shetty: కృతిశెట్టికి ఎవరంటే ఇష్టమంటే...

Krithi Shetty: క్యూట్ శెట్టి ఫ్యాన్స్ హర్టయినా ఏం చేయలేం.. కాని ఆమెకు ఇష్టమైనది ఎవరో చెప్పేంది.

Kranthi
Updated on: 23 May 2021 2:05 PM IST
Krithi Shetty Don’t Like People Those who Lying
X

కృతి శెట్టి (ఫైల్ ఇమేజ్)

Krithi Shetty: ఉప్పెన బేబమ్మకు ఎవరంటే ఇష్టమో చెప్పేసింది. వాళ్లెందుకు ఇష్టమో.. ఎందుకు తను వాళ్లను ఇష్టపడుతుందో క్లారిటీ ఇచ్చేసింది ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. ఈ క్యూట్ శెట్టి ఫ్యాన్స్ హర్టయినా ఏం చేయలేం.. కాని ఆమెకు ఇష్టమైనవారున్నారని చెప్పేసింది మరి.

ఉప్పెన చిత్రంలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న కృతీ ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సినిమా విజ‌యంతో కృతీకి వ‌రుస సినిమా అవ‌కాశాలు క్యూ కట్టాయి. బ‌డా హీరోల స‌ర‌స‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కృతీకి విప‌రిత‌మైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ భామ ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో లైక్‌ల వ‌ర్షం కురుస్తుంది.

ఈ క్ర‌మంలోనే కృతీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి నెటిజ‌న్లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కృతీ చెప్పిన కొన్ని విష‌యాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అబ్బాయిల్లో మీకు న‌చ్చ‌ని అంశం ఏంట‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. అబద్దం చెప్పేవారంటే అస్స‌లు ఇష్ట‌ముండ‌దు. ఇది కేవ‌లం అబ్బాయిల‌కే ప‌రిమితం కాకుండా అబ‌ద్ధ‌మాడే అమ్మాయిలు సైతం న‌చ్చ‌రు. నిజాయితీ, బోల్డ్‌గా మొహం మాటం లేకుండా మాట్లాడే వారు న‌చ్చుతారు. త‌ప్పు చేసినా స‌రే.. భయపడకుండా నిజాయితీగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఉన్న వారంటే నాకు ఇష్టం అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిందీ ముద్దుగుమ్మ‌.

Kranthi

Kranthi

Next Story