వరుస రిలీజ్ లతో సతమతమవుతున్న కృతి శెట్టి

Krithi Shetty: జిమ్ కి వెళ్లే టైం కూడా లేని హీరోయిన్

Jyothi
Updated on: 12 July 2022 4:03 PM IST
Krithi Shetty Does Not Even have Time to Go to the Gym
X

వరుస రిలీజ్ లతో సతవతమవుతున్న కృతి శెట్టి

Krithi Shetty: తెలుగు ప్రేక్షకులకు "ఉప్పెన" సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత "శ్యామ్ సింగరాయి", "బంగార్రాజు" వంటి సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్న కృతి శెట్టి చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే తాజాగా రామ్ సరసన ఈమె హీరోయిన్గా నటించిన "ది వారియర్" సినిమా ఈ వారం విడుదల కి సిద్ధమవుతోంది. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో కృతి శెట్టి క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. రామ్ తో కలిసి చాలా చోట్లకి ప్రమోషన్ల కోసం వెళుతున్న కృతి శెట్టికి కనీసం జిమ్ కి వెళ్ళే సమయం కూడా లేదట. అందుకే లావైపోతానేమోనని మరొక భయం కూడా కృతి శెట్టి ని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కృతి శెట్టి హీరోయిన్ గా నితిన్ హీరోగా నటించిన "మాచర్ల నియోజకవర్గం" సినిమా కూడా ఒక నెల రోజుల్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన పాటలను పోస్టర్లను విడుదల చేస్తూ సందడి చేస్తోంది. ఇలా వెంట వెంటనే రెండు సినిమాలు విడుదల కి సిద్ధమవుతుండడంతో రెండు సినిమాల ప్రమోషన్ల విషయంలో కృతి శెట్టి తల మొలకలు అయినట్టు తనకోసం తనకి అసలు సమయం లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆర్తి అగర్వాల్ వంటి హీరోయిన్లు బిజీగా ఉన్న సమయంలో లావైపోయి ఆ తర్వాత చేతిలో సినిమాలు లేకుండా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయారు. మరి కృతి శెట్టి విషయంలో కూడా అదే అవుతుందా అని అభిమానులు కంగారు పడుతున్నారు.

Jyothi

Jyothi

Next Story