ప్రభాస్ పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ!

ప్రభాస్ పెళ్లి అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ!
x
Highlights

ప్రభాస్.. తెలుగు సినిమా బాహుబలి. యంగ్ రెబల్ స్టార్ గా అందరి మనసులూ దోచిన హీరో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కెరీర్ లో ముందుకు సాగుతున్న నటుడు....

ప్రభాస్.. తెలుగు సినిమా బాహుబలి. యంగ్ రెబల్ స్టార్ గా అందరి మనసులూ దోచిన హీరో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కెరీర్ లో ముందుకు సాగుతున్న నటుడు.

ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ టాలీవుడ్ లో హాట్ టాపిక్కే. దాదాపుగా ఆరేళ్లుగా ప్రభాస్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల పాటు అనుష్క తో ప్రభాస్ పెళ్లి అని పిచ్చి పిచ్చిగా వార్తలు వైరల్ అయ్యాయి. దానికి ఇద్దరూ స్పందించి.. ఆ వార్తలు నిజం కావని కొట్టి పడేశారు.

బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ పెళ్లి వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి. అయితే,బాహుబలి విడుదల తరువాత తాను పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆ వార్తలు ఆగిపోయాయి. బాహుబలి విడుదలైంది.. విజయవంతమూ అయింది. ప్రభాస్ పెళ్లి మాత్రం జరగలేదు. మళ్ళీ ప్రభాస్ పెళ్లి సినిమాలోకంలో చర్చనీయాంశం అయింది. ఈసారి బాహుబలి 2 తర్వాత అంటూ ప్రభాస్ స్పందించారు. క్రమేపీ ప్రభాస్ పెళ్లి వార్తలు తగ్గిపోయాయి. ఇక సాహో విడుదల సమయంలో మళ్ళీ ప్రభాస్ పెళ్లి తెరమీదకు వచ్చింది. అందరూ ప్రభాస్ ను నేరుగా అడిగారు. ఈసారి మాత్రం క్లారిటీ రాలేదు. ఇలా ప్రభాస్ పెళ్లి విషయం ఇప్పటికీ చర్చల్లోకి వస్తూనే ఉంది. తాజాగా మళ్ళీ ఈ విషయం పై వార్తలు మొదలయ్యాయి.

ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జిల్ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమా దర్శకుడు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. త్వరలో తిరిగి వచ్చి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.

ఇదిలా ఉంటె, ప్రభాస్ పెళ్లి విషయమై అయన పెదతల్లి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్యశ్యామలా దేవి తాజాగా స్పందించారు. ప్రభాస్ పెళ్లి జాన్ సినిమా విడుదలైన తరువాత ఉండొచ్చని చెప్పారు. ''ప్రభాస్ పెళ్లి విషయమై అందరూ అడుగుతున్నారు. మేము కూడా పెళ్లి చేయాలనే తొందరలోనే ఉన్నాము. అయితే, మాది పెద్ద కుటుంబం. మా కుటుంబంలో అందరితోనూ సర్దుకుపోగలిగే అమ్మాయి కావాలి. అందుకే ఆలస్యం అవుతోంది. ఈసారి జాన్ సినిమా విడుదల అయినా వెంటనే ప్రభాస్ పెళ్లి జరుగుతుంది.'' అని ఆమె చెప్పారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories