పూజా, రకుల్.. కృష్ణవంశీ పాన్ ఇండియా ప్లాన్

Krishna Vamsis Pan India Project With Pooja Hegde and Rakul Preet Singh
x

పూజా, రకుల్.. కృష్ణవంశీ పాన్ ఇండియా ప్లాన్

Highlights

Krishna Vamsi: కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఇప్పుడు మళ్లీ తన స్పీడ్ పెంచారు.

Krishna Vamsi: కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఇప్పుడు మళ్లీ తన స్పీడ్ పెంచారు. ఆయన దర్శకత్వం వహించిన "రంగమార్తాండ" సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరాఠీలో సూపర్ హిట్ అయిన "నట సామ్రాట్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణవంశీ ఇప్పుడు ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమా తీయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ కథ గురించి ఆలోచన కృష్ణవంశీకి ఎప్పటినుంచో ఉందట. కానీ ఇప్పుడే దానిని ఒక ప్రాజెక్టుగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ లను హీరోయిన్లుగా ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే మరియు రకుల్ ప్రీత్ ఇద్దరికీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.

ఒకవైపు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో ముందుకు దూసుకుపోతుండగా మరోవైపు రకుల్ ప్రీత్ కూడా చేతిలో బోలెడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం కరియర్ పీక్ లో ఉన్న వీరిద్దరితో ఈ ప్రాజెక్టు చేస్తే బాగుంటుందని కృష్ణవంశీ అనుకుంటున్నారట. ఇక సినిమా గురించిన అధికారిక ప్రకటన మరియు మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లను చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories