Krishna Vamsi: విడుదల కి ముందే పాజిటివ్ టాక్ అందుకుంటున్న కృష్ణవంశీ సినిమా

Krishna Vamsi: పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న రంగమార్తాండ

Dhatripriya
Published on: 12 March 2023 11:58 AM IST
Krishna Vamsi Movie is Getting Positive Talk Before Release
X

Krishna Vamsi: విడుదల కి ముందే పాజిటివ్ టాక్ అందుకుంటున్న కృష్ణవంశీ సినిమా

Rangamarthanda: గత కొద్ది రోజులుగా వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా ఇప్పుడు "రంగ మార్తాండ" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరాఠీలో సూపర్ హిట్ అయినా "నట సామ్రాట్" అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా ఈ ఏడాది వేసవి లో థియేటర్లలో విడుదల కాబోతోంది.

సినిమాకి సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మధ్యనే కొంతమంది ఇండస్ట్రీ వాళ్లకి మరియు ప్రెస్ వాళ్ల కోసం చిత్ర బృందం కొన్ని స్పెషల్ షోలు వేశారట. అయితే అందరి నుంచి ఈ సినిమాకి యునానిమస్ గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ మరియు అనసూయ లు తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చారని తెలుస్తోంది. సినిమాలో చాలా న్యాచురల్ ఎమోషన్స్ ఉన్నాయని అందరికీ ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్టర్ కృష్ణవంశీ ఈతరం తల్లిదండ్రులు మరియు పిల్లలకి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ గురించి మరియు సక్సెస్ వెనుక పడుతూ మనల్ని మనం మర్చిపోయే మనస్తత్వాలు గురించి ఈ సినిమా కథ ఉంటుందని అన్నారు. ఇక సినిమాలో ఇళయరాజా అందించిన సంగీతం కూడా బాగా ప్లస్ అవుతుందట. అంతేకాకుండా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పే ఒక మూడున్నర నిమిషాల కవిత కూడా ఉంటుందట.

Dhatripriya

Dhatripriya

Next Story