ట్రోలర్ కి కూల్ గా రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ

*ట్రోలర్ కి కూల్ గా రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ

Rama Rao
Updated on: 5 May 2022 10:00 AM IST
Krishna Vamsi Gave Reply to The Troll | Tollywood News
X

ట్రోలర్ కి కూల్ గా రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ 

Krishna Vamsi: సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులతో పాటే హేటర్లు కూడా ఎక్కువ అవుతున్నారు. వాక్ స్వాతంత్రం బాగా ఎక్కువైపోయి సెలబ్రిటీల మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ వారిని ట్రోల్ చేయడం కొంతమంది నెటిజన్లకు బాగా అలవాటు. కొందరు సెలబ్రిటీలు అలాంటి వారు చేసే కామెంట్లు కి రియాక్ట్ అయ్యి నోరు మూత పడేలా జవాబిస్తూ ఉంటారు మరికొందరు మాత్రం సైలెంట్ గా అవి పట్టనట్టు వదిలేస్తుంటారు.

తాజాగా ఇలాంటి నెగిటివ్ కామెంట్లు ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా ఎదురయ్యాయి. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో పలు పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు అభిమానులతో మాట్లాడుతున్నారు కృష్ణవంశీ. అయితే తాజాగా కృష్ణవంశీ స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన వెస్ట్ సైడ్ స్టోరీస్ సినిమా చూశానని అది చాలా బాగా నచ్చిందని కామెంట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఒక అన్న టెన్షన్ "నీకు అన్నీ ఇంట్రెస్టే, నీ సినిమా తీసి విడుదల చేయటం తప్ప" అంటూ కామెంట్ చేశాడు. అయితే కృష్ణవంశీ మాత్రం చాలా కూల్ గా "గాడ్ బ్లెస్స్ యు" అంటూ ఒక లవ్ సింబల్ కూడా పెట్టి రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు కృష్ణవంశీ వ్యక్తిత్వాన్ని పొగుడుతున్నారు. మరోవైపు కృష్ణవంశీ ఇ దర్శకత్వం వహించిన "రంగమార్తాండ" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story