Super Star Krishna: మంజుల హీరోయిన్ అవడానికి వీల్లేదు అని అప్పట్లో రచ్చ చేసిన అభిమానులు

మంజుల హీరోయిన్ కాలేకపోవడానికి కారణాన్ని గుర్తు చేసుకున్న కృష్ణ
*మంజుల హీరోయిన్ కాలేకపోవడానికి కారణాన్ని గుర్తు చేసుకున్న కృష్ణ
Krishna: టాలీవుడ్ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల తనయులు ఇండస్ట్రీలో హీరోలుగా మారిపోయారు. అయితే కొందరు స్టార్ హీరో కూతుర్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారు ఉన్నారు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సింది. బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో "టాప్ హీరో" అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకుంది మంజుల. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు.
సరిగ్గా బాలకృష్ణ మరియు మంజుల మీద మొదటి షాట్ కి క్లాప్ కొట్టబోతుండగా కృష్ణ అభిమానులు లారీల లో వివిధ వాహనాల్లో వచ్చి షూటింగ్ సెట్లో విధ్వంసం సృష్టించారు.కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ ఇవ్వడానికి వీలు లేదు అంటూ గొడవ చేశారు. తర్వాత ఆ సినిమాలో సౌందర్య ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ ఘటన అని గుర్తుచేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.
అదే ఇంటర్వ్యూ కి హాజరైన మంజుల తను హీరోయిన్ కాకపోయినందుకు ఏమైనా బాధగా ఉందా అని అడగగా, కృష్ణ అలాంటిదేమీ లేదని తనని అభిమానులు ఎప్పుడూ మంజుల ని తమ ఇంటి ఆడపిల్లగా తమ సొంత చెల్లెలిగా చూశారని అందుకే తను హీరోయిన్ అవ్వడం ఇష్టం లేక అలా చేశారని అన్నారు కృష్ణ. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంజయ్ తో మంజుల పెళ్లి కూడా మంజుల తల్లికి ఇష్టం లేదని కానీ మంజుల అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటుందని నమ్మకంతో ప్రొడక్షన్ వారి సహాయంతో కృష్ణ వారి నిశ్చితార్థం జరిపించినట్టుగా చెప్పుకొచ్చారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT